రాయదుర్గం: మారెంపల్లి గ్రామంలో ఆకట్టుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటకం
గుమ్మగట్ట మండలంలోని మారెంపల్లి గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర పై ఏర్పాటు చేసిన నాటకం ఆకట్టుకుంది. గ్రామ పెద్దలు శనివారం రాత్రి రంగురంగుల విద్యుత్ కాంతులతో వేదిక ఏర్పాటు చేయించి ఈ నాటక ప్రదర్శన చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నాటకాన్ని ఆసక్తిగా వీక్షించారు. నాటకంలో కొన్ని సన్నివేశాలు మంత్ర ముగ్ధులను చేశాయి.