యర్రగొండపాలెం: పాత అన్న సముద్రంలో క్షుద్ర పూజలు అంటూ పోలీసులకు ఫిర్యాదు, విచారణ చేపట్టిన పోలీసులు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో ఓ ఇంటిలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని గ్రామస్తులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారించగా ఇంటి వారు తమ మనవడికి కొద్ది రోజులుగా అనారోగ్యం వివాహం కాకపోవడంతో పూజలు చేస్తున్నామని చెప్పారు. మనవడి ఆరోగ్యం కోసం సాధారణ పూజలు చేస్తున్నామని క్షుద్ర పూజలు కాదని వివరించడంతో వివాదం ముగిసింది.