కొండపి: కొండపి మండలం అనకర్లపూడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని శుక్రవారం స్థానిక ఎస్సై త్యాగరాజు అదుపులోకి తీసుకున్నారు పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టారీత్యా నేరమని ఎస్సై త్యాగరాజు ప్రజలను హెచ్చరించారు. ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని త్యాగరాజు విజ్ఞప్తి చేస్తున్నారు.