కొడిమ్యాల: రామన్నపేట గ్రామంలో 17 సంవత్సరాల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,రామన్నపేట గ్రామంలో,ఆదివారం 17 సంవత్సరాల ఓడిగా హారిక అనే బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది, వెల్గటూర్ మండలం,గుడిసెల పేట గ్రామానికి చెందిన హారిక రామన్నపేట గ్రామంలో తన బంధువుల ఇంట్లో ఉంటుంది,అయితే గత వారం రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోందని కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని,హారిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ వెల్లడించారు,