మార్కాపురం: రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని కలెక్టర్ విజయ సునీతకు కాంగ్రెస్ పార్టీ వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి నంద్యాలలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు కుల మతాలకతీతంగా పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేతగా ఉన్నారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోట్లాదిమంది జీవితాలలో వెలుగును నింపారన్నారు.