తాడిపత్రి: తాడిపత్రి ఫైర్ స్టేషన్ లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు
తాడిపత్రిలోని ఫైర్ స్టేషన్ లో మంగళవారం ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి? మంటలను ఎలా ఆర్పాలి? అనే విషయాల పైన విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.