మార్కాపురం: జిల్లా కేంద్రంలోని సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ సందర్శన
మార్కాపురం సబ్ జైలు ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ సందర్శించారు. జైల్లో ఉన్న ఖైదీలకు అందుతున్న భోజన సదుపాయాన్ని పారిశుద్ధ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు ఎవరైనా తమ తరపున వాదించడానికి న్యాయవాదిని సమకూర్చుకోలేకపోతే అటువంటివారు మార్కాపురం మండల న్యాయాసేవాధికారి సంస్థను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఆరవ అదనపు జిల్లా జడ్జి భవాని న్యాయవాదులు పాల్గొన్నారు.