దర్శి: మారెళ్ళ గ్రామంలో మాంసం ధరల ప్రభావంతో చేపలకు పెరిగిన గిరాకీ
ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో మాంసం ధరలు భారీగా పెరిగాయి. దీంతో వారం రోజుల క్రితం కేజీ 300 లోపు ఉన్న ధర ప్రస్తుతం 350 కి చేరింది. ధరల పెరుగుదలతో ప్రజలు మాంసం కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. తక్కువ ధరలో లభించే చేపల వైపు మొగ్గు చూపారు. దీంతో చేపలకు మంచి గిరాకీ ఏర్పడింది. చేపల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వారు చెప్పారు.