మార్కాపురం: 100% ఉత్తీర్ణత లక్ష్యసాధనగా కృషి చేయాలని పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. పొదిలి పట్టణంలోని జడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పాటు ఉప్పలపాడు పాఠశాలలో పదవ తరగతి ఫెయిలై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తలమల్లలో నిర్వహించిన నేను బడికి పోతా కార్యక్రమంలో పాల్గొన్నారు. పొదిలి ఎమ్మార్వో కార్యాలయంలో తనిఖీ చేశారు. కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు ప్రమాదాన్ని గమనించిన కలెక్టర్ కారు ఆపి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.