రాయదుర్గం: కణేకల్లు లో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కణేకల్లు మండల కేంద్రం ముల్లావీధికి చెందిన గొల్ల వరుణ్(18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు చిక్కణ్ణ, నిర్మల కుమారుడైన వరుణ్ మే 28న తిరుపతికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని నీటికుంటలో అతడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ చంద్ర తెలిపారు.