దర్శి: మారెళ్ళ గ్రామంలో పడగొట్టిన రావి చెట్టు నిలబడడంతో పూజలు చేసిన గ్రామస్తులు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో బ్రహ్మంగారి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. హోమం కోసం 15 రోజుల క్రితం గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న రావి చెట్టును జెసిబి తో తొలగించారు. అయితే సోమవారం సాయంత్రం మా చెట్టు మళ్ళీ లేచి నిలబడినట్టు గ్రామస్తులు గమనించారు. దీంతో ఇవాళ ఉదయం గ్రామస్తులంతా చెట్టు వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చా నియంశమైంది.