రాయదుర్గం: గొల్లపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం
గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని కొండ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన గురువారం కలకలం రేపింది. అటుగా పశువుల కోసం వెళ్లిన కాపర్లు మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా కొండపై నుంచి పడి మృతి చెందినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.