తాడిపత్రి: గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: తాడిపత్రిలో ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు
గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తాడిపత్రి ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు అన్నారు. తాడిపత్రి లోని పలు ప్రాంతాల్లో గురువారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడారు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ల నుంచి గ్యాస్ లీక్ అయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు.