గిద్దలూరు: కొమరోలు మండల పరిసర ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం, ఎండతోపాటు ఒకేసారి వర్షం కురవడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒకపక్క ఎండ విపరీతంగా కాస్తున్న వర్షం కూడా కురవడం విచిత్ర వాతావరణం నెలకొంది. కొంతవరకు వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాటుతూ ఉండడం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.