గిద్దలూరు: రాచర్లలో వాహన తనిఖీలు చేపట్టి వాహనదారులు సైడ్ ఇండికేటర్లు ఉపయోగించాలని విజ్ఞప్తి చేసిన ఎస్ఐ కోటేశ్వరరావు
రోడ్డు ప్రమాదాల నివారణకు సైడ్ ఇండికేటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని వాహనదారులకు మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాచర్ల మండల పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై కోటేశ్వరరావు సరైన ధ్రువపత్రాలు లేని వాహనదారులను హెచ్చరించడమే కాకుండా జరిమానా విధించారు. ముఖ్యంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించాలన్నారు. మలుపులు తిరిగే సమయంలో తప్పనిసరిగా వాహన సంబంధిత ఇండికేటర్లు ఉపయోగించడమే కాకుండా రోడ్డు పక్కన ఆపి ఉన్న వాహనానికి సైడ్ ఇండికేటర్లు వేసి ప్రమాదాలు నివారించాలన్నారు.