కొండపి: కొండపిలో రెండవ రోజు ఘనంగా మహానాడు, భారీగా ఆటోలలో ర్యాలీగా మహానాడుకు తరలివచ్చిన కార్యకర్తలు
ప్రకాశం జిల్లా కొండపిలో టిడిపి కార్యకర్తలు జోష్ లో కనిపించారు. గురువారం జరిగిన మహానాడుకు భారీగా ఆటోలలో ర్యాలీగా తరలివచ్చారు. కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం రెండవ రోజు జరిగింది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆటోలలో ర్యాలీగా మహానాడుకి కార్యకర్తలు చేరుకుని మహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు.