రాయదుర్గం: గొల్లపల్లి గ్రామంలో విద్యుదగాధానికి గురై యువరైతు రంజిత్ రెడ్డి మృతి
గుమ్మగట్ట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యువ రైతు రంజిత్ రెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. చదువు పూర్తిచేసి తల్లిదండ్రులకు అండగా వ్యవసాయం చేస్తున్న రంజిత్ శుక్రవారం తెల్లవారుజామున పొలంలో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లి షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.