రాయదుర్గం: విద్యుదగాధానికి గురై తండ్రి కొడుకు మృతి
గుమ్మగట్ట మండలంలోని కరసూరయ్య దొడ్డి వద్ద విద్యుదగాధానికి గురై తండ్రి కొడుకు మృతి చెందారు. బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, అతని కొడుకు తేజ బోరు మోటార్ల రిపేరీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. శుక్రవారం కరసూరయ్య దొడ్డి వద్ద పైపులు తీసుస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్ కు గురయ్యారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు విచారిస్తున్నారు.