గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో ఈనెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జూన్ 27వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. సంజీవిని హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి సీఎం గిద్దలూరు కు వస్తున్నారని అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరికొన్ని వరాల జల్లులు కురిపిస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గిద్దలూరు కు వస్తున్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలలో జోష్ నెలకొంది. ఇప్పటికే హెలిపాడ్ సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు.