యర్రగొండపాలెం: దోర్నాల మండలం ఎగువచర్లపల్లి గ్రామంలో బోరు వేసి మంచినీటి సమస్యను పరిష్కరించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిలక చర్ల గ్రామంలో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఎగువచర్లపల్లి గ్రామ మహిళలు తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే బోరు వేసి సమస్యను పరిష్కరిస్తానని మహిళలతో చెప్పారు. దీంతో చెప్పిన ప్రకారం బోరు వేసి గ్రామస్తుల దాహార్తి తీర్చడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.