గిద్దలూరు: గిద్దలూరులో ఇద్దరు పాస్టర్ల మధ్య సోషల్ మీడియా వివాదం, ఓ పాస్టర్ పై మరో పాస్టర్ వర్గం దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఇద్దరు పాస్టర్ల మధ్య సోషల్ మీడియా వివాదం నెలకొంది. హైదరాబాద్ కు చెందిన ఓ పాస్టర్ కు సోషల్ మీడియాలో గిద్దలూరు కు చెందిన పాస్టర్ కామెంట్లు పెడుతున్నాడని హైదరాబాద్ పాస్టర్ గిద్దలూరు పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే పోలీసులు హైదరాబాదులోని కేసు పెట్టుకోవాలని చెప్పి పంపిస్తారు. హైదరాబాద్ పాస్టర్ తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ లో గిద్దలూరు పాస్టర్ కు చెందిన వర్గీయులు దాడికి పాల్పడగా హైదరాబాద్కు చెందిన పాస్టర్ గాయపడ్డాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.