గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం లో మెడికల్ షాప్స్ మూసివేసిన అసోసియేషన్ సభ్యులు, ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఉదయం నుంచి మెడికల్ షాప్స్ స్వచ్ఛందంగా మూసి వేశారు. కరోనా సమయంలో ప్రజల కోసం ఆన్లైన్లో మందులు విక్రయించేందుకు తీసుకువచ్చిన జీవోలను రద్దుచేసి ఆన్లైన్లో మందులను విక్రయించడానికి నిలిపివేయాలని మెడికల్ షాప్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ చేపట్టి తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆన్లైన్లో మందుల విక్రయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు మెడికల్ షాప్స్ నిర్వాకులు తెలిపారు.