రాయదుర్గం: వైభవంగా కణేకల్లు చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం
కణేకల్లు లో సుప్రసిద్ధ శ్రీ చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం మడుగు తేరు నిర్వహించగా సాయంత్రం వేలాది మంది భక్త జన సందోహం మద్య బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎస్ నాగమధు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు