రాయదుర్గం: జాజరకల్లు టోల్ గేట్ వద్ద టిప్పర్ ట్యాంకర్ డీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవ దహనం
అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై జాజరకల్లు టోల్ ప్లాజా దగ్గర ఆయిల్ ట్యాంకర్, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. టిప్పర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం మద్యాహ్నం ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ లు నబీరసూల్, గురుప్రసాద్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు.