యర్రగొండపాలెం: తోక పల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ప్రతాప్ కుమార్ మృతి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ సమీపంలో ప్రతాప్ కుమార్ కుంట నుండి బైక్ పై వెళ్తుండగా అడవి పంది అడ్డొచ్చింది. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను వెంటనే 108 వాహనంలో మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సంఘటనతో తోకపల్లి ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి