కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం లో ఇంటర్ లో సత్తా చాటిన అక్కా తమ్ముడు
కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ సంస్థలో చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న సురేఖ, నాగరాజు దంపతుల కుమార్తె, కుమారుడు బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. కుమారుడు మోక్షజ్ఞ ఎంపీసీ ఫస్టియర్ లో 470 మార్కులకు గాను 451 మార్కులు, రూపిక సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులు గాను 919 మార్కులు సాధించి సత్తా చాటింది. ఇంటర్లో సత్తా చాటిన అక్కా తమ్ముడిని ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.