కొండపి: సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై నిలబడి ఉన్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కొడుకుకు కాలు విరగగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.