గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో అకాల వర్షాలకు నిరాశ్రయులుగా మారిన యానాది కుటుంబాలు, పట్టించుకోని అధికారులు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామానికి చెందిన ఆరు యానాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆరు పూరీ గుడిసెలు నేలకొరిగాయి. కట్టుబట్టలతో తాము రోడ్డుపైన పడ్డామని యాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తమను ఎవరూ పట్టించుకోలేదని సంఘటన జరిగే రెండు రోజులవుతున్న తమకు ఎటువంటి సహాయం అందలేదన్నారు. బియ్యం నిత్యవసర సరుకులు తడిచిపోవడంతో పిల్లలకి కడుపునిండా భోజనం పెట్టలేని పరిస్థితి అని వాపోయారు.