కళ్యాణదుర్గం: ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని గా ప్రకటించారు,అందరూ సంబరాలు చేసుకోవాలి: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని గా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవాలన్నారు. సంబరాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.