రాయదుర్గం: టి. వీరాపురం వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం
రాయదుర్గం మండలం టి.వీరాపురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదే గ్రామానికి చెందిన నరసింహులు దుర్మరణం పాలయ్యాడు. బైక్ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడిఉండగా అటుగా వెళుతున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఆటోలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. . ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.