రాయదుర్గం: పట్టణంలో హోల్ సేల్ కూరగాయల మార్కెట్ టోల్ గేట్ రుసుం వసూలు వివాదం, కూటమి నేతల మద్య వాగ్వివాదం
రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో టోల్ గేట్ రుసుం వసూలు వసూలు కూటమి నేతల మద్య వైరాన్ని పెంచింది. రాయదుర్గం మున్సిపాలిటీలో దినసరి, కూరగాయల మార్కెట్ లో టోల్ గేట్ రుసుం వసూలు కు ఏప్రిల్ 3 న బహిరంగ వేలం జరిగింది. ఈ వేలంపాటలో టిడిపి నాయకుడు, వాల్మీకి సంఘం నేత నాయకుల మలకన్న దినసరి కూరగాయల మార్కెట్ 32 లక్షలు, వారపు సంత 12 లక్షలకు దక్కించుకున్నారు. అయితే రాత్రి వేళ జరిగే హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కు వందలాది మంది రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయాలు జరుపుతారు.