దర్శి: ముండ్లమూరు మండలంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించిన అధికారి తిరుమలరావు
Darsi, Prakasam | Apr 24, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి తిరుమలరావు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు తక్కువగా వాడి ఎక్కువ దిగుబడి పొందే అంశంపై అవగాహన కల్పించారు. అందిస్తున్న సబ్సిడీపై యంత్రాలను మరియు విత్తనాలను పొంది వ్యవసాయం సాగించాలన్నారు. ఎటువంటి అనుమానాలు ఉన్న స్థానిక రైతు సేవ కేంద్రాలను సంప్రదించి అనుమానాలు తీర్చుకోవాలన్నారు.