కొండపి: సింగరాయకొండలో బాల్యవివాహాల కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మధుసూదన్ రావు
ప్రకాశం జిల్లా అక్షయ తృతీయ పురస్కరించుకొని బాల్యవివాహాల నివారణ పై ఆదివారం సింగరాయకొండలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మధుసూదన్ రావు పాల్గొని బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చదువుకోవాల్సిన వయసులో బాలికలను చదివించాలని బలవంతంగా బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు. పిల్లలతో పెట్టి చాకిరీ చేయించడం మంచి పద్ధతి కాదని ప్రభుత్వమే అందుకు తల్లికి వందనం పేరున ఏడాదికి ఒక్కొక్కరికి 15000 ఇస్తుందని తెలిపారు.