కొండపి: కొండపిలో డ్వాక్రా మహిళలకు 5జి స్మార్ట్ ఫోన్ పంపిణీ చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి స్వామి శనివారం వీవోఏలకు 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. పొదుపు సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత కోసం టెక్నాలజీని తీసుకువచ్చినట్లు తెలిపారు. డ్వాక్రా వ్యవస్థ సీఎం చంద్రబాబు నాయుడుకు మానస పుత్రికని అన్నారు. రాష్ట్రంలో 25వేల మంది వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని అన్నారు.