మార్కాపురం: రాయవరం గ్రామంలోని చెరువు కట్టపై పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్లు, చర్యలు తీసుకోవాలని కోరిన స్థానికులు
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని చెరువు కట్టపై పట్టపగలే వీధిలైట్లు వెలుగుతున్నాయి. విద్యుత్ ఆదా చేయాలని జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పై ప్రజల నుండి పలు విమర్శలు వినపడుతున్నాయి. కట్టపై ఉన్న స్తంభాలన్నిటికీ వీధిలైట్లు వెలుగుతూ వాహనదారులకు దర్శనమిచ్చాయి. అధికారులకు సిబ్బందికి కనపడటం లేదా అని వాహనదారులు ఆరోపించారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు