గిద్దలూరు: గిద్దలూరు బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మార్కాపురం జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడు కృష్ణారావు
మార్కాపురం జిల్లా బిజెపి అధ్యక్షుడు కృష్ణారావు ఆదివారం గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణారావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విస్తరించిన ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. అలానే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అగ్రదేశాల సరసన నిలబెట్టారని అన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.