కొండపి: సింగరాయకొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో శనివారం సీఐ హజరతయ్యా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను సిఐ తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.