దర్శి: దర్జీ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రము సందర్భంగా ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి విశిష్ట పూజా కార్యక్రమాలు చేశారు. స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.