కళ్యాణదుర్గం: గుండుగానిపల్లిలో మాజీ సర్పంచ్, తెలుగుదేశం నాయకులు మారన్న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
బ్రహ్మసముద్రం మండలం గుండుగానిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మారెన్న (69) బుధవారం మృతి చెందాడు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో మృతి చెందాడు. మారెన్న మృతి పట్ల గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం ప్రకటించి, నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.