మార్కాపురం: ఉద్యోగంలో చేర్పించుకోవడంలేదని తర్లుపాడు టెక్నికల్ అసిస్టెంట్ మహబూబ్ బాషా జిల్లా కలెక్టర్ కు వినతి
తర్లుపాడు మండలం ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ మహబూబ్ బాషాను ఉద్యోగంలో చేర్పించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. భాష మాట్లాడుతూ... గతంలో సామాజిక తనిఖీలో అవకతవకలపై షోకజ్ నోటీసులు ఇచ్చారన్నారు. జిల్లా అధికారులకు సంజాయిషి చెప్పుకొని జాయినింగ్ ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాను అన్నారు. కానీ ఏపీఓ నెల రోజులుగా ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని భాష ఆరోపించారు.