యర్రగొండపాలెం: పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ దారుణ హత్య
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. మృతుడు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు పరిశీలించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.