కమలాపూర్: కమలాపూర్‌లో విషాదం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఆర్థిక ఇబ్బందుల వల్ల బుర్రి గణేశ్(29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాల వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న గణేశ్, గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి రమ ఫిర్యాదు మేరకు ఎస్సై దిలీప్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.