గిద్దలూరు: రాచర్ల మండలంలోని రంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన తెప్పోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రంగనాయకుడి తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డీఎస్పీ నాగరాజు తిప్పోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోవిందా గోవిందా అంటూ ఆలయ ప్రాంగణం మారుమోగింది.