రాయదుర్గం: రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు మాట్లాడే అర్హత లేదు : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే లుగా ఉండి రాయలసీమ గురించి ఏనాడూ మాట్లాడని వైసిపి నేతలు అధికారం కోల్పోగానే రాయలసీమ గురించి, రాయలసీమ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు మండిపడ్డారు. శుక్రవారం రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లు జగన్ కు బానిసలుగా బతికిన దద్దమ్మలకు రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల్లో జరిగుతున్న పనులు సైతం ఆపేసిన వారు మీరు కాదా అని నిలదీశారు.