రాయదుర్గం: కదిరంపల్లి టోల్ గేట్ ఎత్తివేయండి : రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్
రాయదుర్గం - అనంతపురం రోడ్డులో కదిరంపల్లి టోల్ గేట్ వసూలపై రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రమైన అనంతపురం వెళ్లడానికి నిబంధనలకు విరుద్ధంగా రెండు టోల్ గేట్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు టోల్ గేట్ మినహాయింపు ఇవ్వాలని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. హానగల్ వరకూ హైవే నిర్మాణం పూర్తి కాకుండానే టోల్ గేట్ రుసుం వసూలు చేయడం తగదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే టోల్ గేట్ ఎత్తివేయాలని కోరారు.