గిద్దలూరు: కంభం అర్బన్ కాలనీలో కార్డెన్ సర్చ్, సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం అర్బన్ కాలనీలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సిఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించామని ప్రజలకు రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు సీఐ తెలిపారు. సెర్చ్ లో ముగ్గురు ఎస్సై లతోపాటు 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.