మార్కాపురం: జిల్లా ఏర్పడి ఐదు నెలలు కావస్తుంది ఎస్పీని కేటాయించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా ఏర్పడి ఐదో నెల పూర్తి కావస్తుంది. జిల్లా అధికారుల్లో జిల్లా కలెక్టర్ ను నియమించారు. కానీ జిల్లా ఎస్పీని నియమించకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇన్చార్జి ఎస్పీగా పరిపాలన కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి ఎస్పీ లేకపోవడంతో జిల్లా పోలీసు కార్యాలయాల ఏర్పాట్లలో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అధికారులకు వర్క్ లోడ్ ఎక్కువైంది. ఎస్పీని నియమించాలని పట్టణ ప్రజల కోరారు.