దర్శి: భూగర్భ జలం పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపిన దర్శి ఎంపీడీవో వసంతరావు నాయక్
Darsi, Prakasam | May 13, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో జల ధార జల హారతి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో వసంతరావు నాయక్ అన్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చెరువులలో పూర్తిస్థాయిలో నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. చెరువులలో కంప తొలగింపు పూడిక తీసివేయట తదితర చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది అన్నారు.