గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహారం నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణబాబు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహారం నాణ్యతను పరిశీలించి ఆహారం ఆరగించేందుకు క్యాంటీన్ కి వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహారం నాణ్యతను రుచిని అడిగి తెలుసుకున్నారు. అలానే వస్తున్న ప్రజలకు టోకెన్లు సరిపోతున్నాయా లేదా అదనంగా పెంచవలసి ఏమైనా ఉందా అని సూపర్వైజర్ ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా క్యాంటీన్ కి వచ్చే వారిపట్ల గౌరవంగా మెలుగుతూ క్యాంటీన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి కమిషనర్ తెలిపారు.