గిద్దలూరు: గిద్దలూరు మండల పరిషత్ ప్రాంతాలలో భారీ వర్షం, చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందిన ప్రజలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం అయ్యేసరికి అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకొని భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.